నాగర్ కర్నూల్ లో ఉపాధ్యాయుల వేధింపులతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భరత్ అనే విద్యార్థి ఉపాధ్యాయుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు శ్రీపురం చౌరస్తాలో రాస్తారోకో, గురుకుల కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన సందర్భంగా పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.