అనంతపురంలో బొగ్గుల బట్టీలపై దాడులు చేసి వెట్టిచాకిరీ నుంచి విముక్తి
రిపోర్టర్: సునీల్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లాలో బొగ్గుల బట్టీల్లో ఐదేళ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్న తొంబై ఎనిమిది మందికి అధికారులు విముక్తి కల్పించినట్లు ఆర్డీవో వసంతబాబు తెలిపారు. బుధవారం బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల్లో రెవెన్యూ, కార్మిక, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మహారాష్ట్రకు చెందిన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయిస్తున్న పదకొండు మంది మధ్యవర్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.