ధన్తేరాస్ వేడుకలు: నోట్ల కట్టలు, ఆభరణాలతో మహాలక్ష్మి ఆలయం అలంకరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: రత్లాం

ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ లోని రత్లాం మహాలక్ష్మి ఆలయాన్ని కోట్లాది రూపాయల నగదు, బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించినట్లు ప్రధాన పూజారి అశ్విని వ్యాస్ తెలిపారు. అమ్మవారి సన్నిధిలో కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా రూపొందించిన కల్ప వృక్షం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచే మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని వివరించారు.