స్థానిక ఎన్నికల్లోనూ వంద శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపు
రిపోర్టర్: శివ
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ముఖ్యనేతలతో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం సమావేశమయ్యారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వంద శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ముప్ఫై ఇద్దరు సభ్యులతో కార్యనిర్వాహక దళ్ కమిటీని ప్రకటించారు. పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.