దేశంలో వందేళ్లు పూర్తి చేసుకున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ అక్టోబర్ 1, 2026 నాటికి వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదిక ద్వారా అధికారులు తెలిపారు. భారత్లో మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 1, 1926న ఒక సలహా సంఘంగా ఏర్పడిందని పేర్కొన్నారు. వలస పాలన కాలం నుంచి స్వతంత్ర భారతదేశం వరకు అనేక మార్పులతో ఈ వ్యవస్థ స్వయంప్రతిపత్త రాజ్యాంగ సంస్థగా ఎదిగిందని నిపుణులు స్పష్టం చేశారు. సివిల్ సర్వీసెస్ సహా అనేక కీలక పరీక్షల ద్వారా అత్యుత్తమ అధికారులను ఈ సంస్థ ఎంపిక చేస్తోందని వివరించారు.