మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో కాంగ్రెస్ పాలనకు ఎదురుదెబ్బ

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై 'మూడ్‌ ఆఫ్‌ తెలంగాణ' సర్వే తీవ్ర అసంతృప్తిని వెల్లడించింది. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో రేవంత్‌రెడ్డి పాలన బాగోలేదని, హామీలు అమలు కాలేదని ప్రజలు స్పష్టం చేశారు. గత కేసీఆర్‌ పాలనే మెరుగని భారీ సంఖ్యలో ప్రజలు అభిప్రాయపడటం అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.