మహిళలకు భారీ ఊరట: వేల కోట్ల రుణాలు అందించిన ముఖ్యమంత్రి విజయ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఈరోడ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈరోడ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు భారీగా బ్యాంకు రుణాల చెక్కులను అందజేసినట్లు అధికారులు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో సీఎం విజయ్ భుజంపై వృద్ధురాలు చేయి వేసి ఫొటో దిగిన ఆప్యాయమైన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.