తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సూర్యాపేట

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంపకాల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని తాగు, సాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడానికి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.