'రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన దొంగ': సీఎంపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన దొంగ అని, ఆనాడు యాభై లక్షలు ఇస్తూ దొరికిపోయిందని, ఇవాళ ముప్పై లక్షల ఎకరాల భూమి విషయంలో దొరికిపోయారని ఘాటు విమర్శలు చేశారు. ప్రజల భూములు గుంజుకునే అలవాటు తమకు లేదని స్పష్టం చేస్తూ, డైవర్షన్ రాజకీయాల కోసం ఎన్ని చిల్లర ఆరోపణలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.