మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి నారాయణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో మురికివాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. పాత నగరంలోని వెలంపేటలో ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను తగ్గించిందని విమర్శించారు. విశాఖలో మరో నాలుగు మురికివాడలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.