ఇస్తాంబుల్ ఏషియన్ బెంచ్ ప్రెస్ పోటీల్లో రష్మికి రజతం
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
తుర్కియేలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న ఏషియన్ ఎక్విప్డ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్లో నెల్లూరు యువతి టి.రష్మి వెండి పతకం సాధించారు. 63 కేజీల విభాగంలో 95 కేజీల బరువు ఎత్తి ఆమె ద్వితీయ స్థానంలో నిలిచారు. బెంగళూరులో బీటెక్ చదువుతున్న ఆమె, గత కొంతకాలంగా వివిధ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ రాణిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై దేశం, తెలుగు రాష్ట్రాల కీర్తిని ఇనుమడింపజేసిన రష్మిని పలువురు క్రీడాకారులు అభినందించారు.