మహారాష్ట్రలో కేజీ రూ. 27 వేల గోల్డెన్ మోదక్!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని నాసిక్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్ స్వీట్స్ అనే దుకాణం 24 క్యారెట్ల తినదగిన బంగారంతో తయారు చేసిన 'గోల్డెన్ మోదక్'ను విక్రయిస్తోంది. కేజీ ధర రూ. 27 వేలు ఉండటంతో ఈ ప్రత్యేక మిఠాయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.