ములకలపల్లి మండలంలో పాఠశాల తాళాలు పగులగొట్టిన ఆకతాయిలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో గురువారం రాత్రి ఆకతాయిలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన హెచ్ఎం సిబ్బంది రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలలో సిగరెట్లు, మద్యం సీసాలు లభ్యం కావడంతో పాటు గంజాయి మత్తు కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి దొంగతనం జరగలేదని, ఆకతాయిలను నియంత్రించేందుకు నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్సై మధు ప్రసాద్ తెలిపారు.