రష్యా ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో విశాఖ యువకులు: ప్రాణాలు కాపాడాలని వేడుకోలు
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నంకు చెందిన ఐదుగురు యువకులు ఉక్రెయిన్ సరిహద్దు యుద్ధ క్షేత్రంలో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీలో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యమమంటూ మోసపూరితంగా సైన్యంలో చేర్పించి సరిహద్దులకు పంపారని యువకులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని భారత రాయబార కార్యాలయ అధికారుల ద్వారా తమ ప్రాణాలను రక్షించాలని వారు వీడియో సందేశాల ద్వారా విజ్ఞప్తి చేశారు.