ఈడీ ఉచ్చులో భారీ మనీలాండరింగ్ నెట్వర్క్: విశాఖ సోదాల్ లో కోట్లాది రూపాయలు స్వాధీనం

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

నకిలీ పత్రాలతో విదేశాలకు వేల కోట్ల రూపాయలను అక్రమంగా తరలిస్తున్న భారీ మనీలాండరింగ్ నెట్వర్క్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఛేదించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నం సబ్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఢిల్లీ, కోల్కతాల్ లోని ఏడు ప్రాంతాల్ లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించి సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల నేరపూరిత లావాదేవీలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ కుంభకోణంలో వడ్డీ మహేశ్ తో పాటు మరికొందరు కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.