మట్టి వినాయకులనే పూజించాలన్న పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మాదాపూర్ డివిజన్లోని పలు మండపాల్లో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో జలాశయాలు కలుషితమవుతాయని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, మండపాల వద్ద పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించాలని నిర్వాహకులకు, అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.