యూకే పర్యటనపై సీఎం విజయ్‌ను తీవ్రంగా విమర్శించిన అన్నామలై

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మధురై

తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ లండన్ పర్యటనపై రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై మధురైలో తీవ్ర విమర్శలు చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌ను చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించిన ఆయన, విదేశాల కంటే రాష్ట్రం నుంచే పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు. కేవలం 1 శాతం వృద్ధి రేటు ఉన్న దేశానికి పెద్ద ప్రతినిధి బృందంతో వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని ప్రశ్నిస్తూ, విదేశీ పర్యటనలకు బదులుగా కోయంబత్తూరు, మధురై వంటి పారిశ్రామిక కేంద్రాల్లో పర్యటించాలని హితవు పలికారు.