స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలి: అండ్లూరి గణేష్
రిపోర్టర్: andluri ganesh
స్థలం: గజపతినగరం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు సముచిత రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విజయనగరం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జాయింట్ సెక్రెటరీ అండ్లూరి గణేష్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమాజంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తేనే నిజమైన సామాజిక న్యాయం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు స్పందించి తమ వర్గానికి సముచిత స్థానం ఇవ్వాలని నాయకులు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.