గూగుల్ పేలో సరికొత్త షాపింగ్ ఫీచర్: డిస్కవర్ షాప్ ప్రయోగాత్మక పరిశీలన
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
గూగుల్ పే యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులతో పాటు ఈ-కామర్స్ సేవలను అందించేందుకు సంస్థ సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు టెక్ నిపుణులు తెలిపారు. భారతదేశంలోని యూజర్ల కోసం డిస్కవర్ షాప్ పేరిట ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ షాపింగ్ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనిద్వారా వినియోగదారులు వేరే యాప్స్‌లోకి వెళ్లకుండానే గూగుల్ పే నుంచే నేరుగా దుస్తులు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.