భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు మరియు అన్నప్రసాద వితరణ
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
మండలంలోని ఎన్టీఆర్ నగర్లో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు స్థానిక ప్రముఖులు, ముఖ్య అతిథులు మరియు వందలాది మంది భక్తులు హాజరై శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎన్టీఆర్ నగర్ యువత ఎంతో చురుగ్గా సేవలందించి ఏర్పాట్లను విజయవంతం చేశారు.