ట్రోలర్లకు గట్టి బదులిచ్చి ఫిజిక్ ప్రదర్శించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్
రిపోర్టర్: హరి
స్థలం: ముంబై
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ లైవ్ షోలో తన టీ-షర్ట్ తీసి అద్భుతమైన ఫిజిక్‌ను ప్రదర్శించడం ద్వారా ట్రోలర్లకు గట్టి బదులిచ్చారు. తన ఆరోగ్యం, వయసు మరియు బిగ్‌బాస్ ప్రోమోపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. 60 ఏళ్ల వయసులోనూ ఎవరైనా అసూయపడేలాంటి ఫిజిక్‌ను కలిగి ఉండి, తాను ఎందుకు ఓజీ ఫిట్‌నెస్ ఐకాన్ అనే విషయాన్ని మరోసారి నిరూపించారు.