ఢిల్లీ ర్యాలీని అడ్డుకునే కుట్ర: కేంద్రంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి మెగా నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రైళ్లు కేటాయించకుండా కాలయాపన చేసి చివరి నిమిషంలో నిరాకరించడం దారుణమని ఆయన మండిపడ్డారు. రైల్వే కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బస్సుల ద్వారా ఢిల్లీకి చేరుకుని నిరసన గళం వినిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.