తెలంగాణలో వేగవంతమైన రెండో పీఆర్సీ ప్రక్రియ, సీఎస్ కీలక ఆదేశాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందించాలని సీఎస్ స్వయంగా ఛైర్మన్ ఎన్. శివశంకర్‌కు లేఖ రాశారు. ఉద్యోగ సంఘాల నుంచి డీఏ బకాయిలు మరియు ఫిట్‌మెంట్ డిమాండ్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం వేగంగా స్పందించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.