తాటిపూడి జలాశయానికి పోటెత్తిన వరద: రెండు గేట్లు ఎత్తివేత
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జలాశయానికి ఆరు వేల క్యూసెక్కుల ఇన్ఫ్ లో వస్తుండటంతో, నీటి మట్టాన్ని పర్యవేక్షించేందుకు రెండు స్పిల్వే గేట్లను ఎత్తి సుమారు ఆరు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోస్తనీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.