భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్లూరి పోలీసులు విజ్ఞప్తి

రిపోర్టర్: విజయ్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అల్లూరి పోలీస్ అధికారిక ఎక్స్ (ట్విటర్) వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు, వరదల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తద్వారా సురక్షితంగా జీవించాలని కోరారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.