క్యాష్ టార్గెట్ల పేరుతో ఆర్టీసి కండక్టర్లపై డిపో మేనేజర్ల తీవ్ర ఒత్తిడి

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ గ్రేటర్‌ పరిధిలో ఆర్టీసీ కండక్టర్లపై డిపో మేనేజర్లు క్యాష్ టార్గెట్ల పేరుతో తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగి పురుషులు తగ్గడంతో నగదు కలెక్షన్లు పడిపోయాయి. టార్గెట్లు చేరుకోలేదంటూ కండక్టర్లకు మెమోలు జారీ చేయడంపై యూనియన్లు, సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.