ఏపీలో భారీ పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఐటీ మరియు క్వాంటం రంగాల అభివృద్ధికి సంబంధించి కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో విశాఖపట్నం, అమరావతి మరియు కడప జిల్లాల్లో రూ.526.25 కోట్ల పెట్టుబడులతోపాటు 8,896 ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐటీ ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.