ఇరుముడి వివాదం: మైత్రీ మూవీ మేకర్స్ కు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి చిత్రంలో బాలనటి నక్షత్రను నటింపజేయడంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడం, ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొనడంపై పూర్తి వివరాలతో నవంబర్ 4న విచారణకు హాజరు కావాలని జాయింట్ కమిషనర్ స్పష్టం చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ అనుమతులు, కాల్షీట్లు, పారితోషికంలో ఇరవై శాతం ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు సమర్పించాలని ఆదేశించారు.