ది ప్యారడైజ్ సినిమాకు నైజాంలో భారీ అడ్వాన్స్ బుకింగ్స్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే రూ.1 కోటికి పైగా గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోవడంతో పలు షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. బ్లాక్‌బస్టర్ దసరా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది.