స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అలర్ట్: మార్కెట్లోకి అధునాతన ఛార్జింగ్ ఎజెక్టర్ పరికరాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

మొబైల్ ఫోన్ ను రాత్రి పూట ఛార్జింగ్ లో పెట్టి మరిచిపోయే వినియోగదారుల భద్రత కోసం మార్కెట్లోకి కొత్తగా ఛార్జింగ్ ఎజెక్టర్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని టెక్ నిపుణులు తెలిపారు. బ్యాటరీ నూటికి నూరు శాతం నిండగానే ఈ పరికరం సహాయంతో ఛార్జింగ్ పిన్ దానంతటదే బయటకు వచ్చేస్తుందని వారు పేర్కొన్నారు. దీనివల్ల బ్యాటరీ ఉబ్బిపోవడం, ఫోన్ కాలిపోవడం వంటి ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని వెల్లడించారు.