విజయనగరం ఉత్సవ వేడుక: పైడితల్లి అమ్మవారి తొలేలు ఉత్సవంలో భక్తుల పూజలు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేలు ఉత్సవం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం మధ్యాహ్నం ప్రారంభంకానుండటంతో కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ పర్యవేక్షణలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.