అమెరికా సైనిక స్థావరాలపై సైబర్ దాడి: ఫ్రీజర్లు విఫలమై ఆహారం కలుషితం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Washington

అమెరికాలోని వివిధ సైనిక స్థావరాల్ లో వాణిజ్య ఫ్రీజర్లు విఫలమై ఆహారం పాడైపోవడం వెనుక సైబర్ దాడి ఉందనే కోణంలో పెంటగాన్ దర్యాప్తు చేపడుతోందని ఓ రక్షణ అధికారి వెల్లడించారు. అరిజోనాలోని ఫోర్ట్ హువాచుకా సైనిక స్థావరంతో పాటు దాదాపు ఆరు కమ్మసరీలలో ఈ సాంకేతిక లోపాలు తలెత్తాయని తెలిపారు. ఈ ఘటనపై అమెరికా సైబర్ కమాండ్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఏజెన్సీలు సంయుక్తంగా అత్యున్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు.