ఢిల్లీ విమానాశ్రయంపై అమెరికా టూరిస్ట్ సంచలన వ్యాఖ్యలు: తీవ్ర దుమారం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఢిల్లీ

భారత్లో విమానాశ్రయాల అనుభవాలపై అమెరికా టూరిస్ట్ డేమన్ జుంబ్రోజెల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బెంగళూరు, కోల్కతా విమానాశ్రయాలను ప్రశంసించిన ఆయన, ఢిల్లీ విమానాశ్రయం అత్యంత గందరగోళంగా ఉందని ఆరోపించారు. విదేశీయులెవరూ ఢిల్లీ ద్వారా దేశంలోకి ప్రవేశించవద్దని ఆయన సోషల్ మీడియాలో వీడియో ద్వారా సూచించారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ విమానాశ్రయ అధికారులు స్పందించి, వివరాలు పంచుకోవాలని కోరారని డిజిటల్ క్రియేటర్ వెల్లడించారు.