నేలకొండపల్లిలో పర్యావరణ రక్షణకై మొక్కలు నాటిన విద్యార్థులు
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు బాధ్యతగా మొక్కలు నాటాలని ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణంపై విద్యార్థులకు చైతన్యం కల్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.