అమెరికాలో ప్రత్యేక స్పేస్ అకాడమీ ఏర్పాటుకు నాసా సన్నాహాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమెరికా

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా కొత్త స్పేస్ అకాడమీని ఏర్పాటు చేస్తోంది. రేపటి తరం స్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వ్యోమగాములను తయారు చేసే లక్ష్యంతో 300 ఎకరాల్లో ఈ క్యాంపస్ నిర్మించనున్నారు. 2028 నాటికి తొలి బ్యాచ్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం స్థలం, నిధులు సమకూర్చే రాష్ట్రాల నుండి నాసా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.