ఎమ్మెల్సీ పోటీకి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి విముఖత: కాంగ్రెస్లో రాజకీయ కలకలం
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తన ప్రమేయం లేకుండానే అధిష్టానం పేరు ఖరారు చేసిందని, తాను పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న సర్వోత్తం రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.