పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నెల్లూరు జిల్లాకు పద్దెనిమిదో స్థానం

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌ కేంద్రాల్లో అర్జీలు వస్తున్నప్పటికీ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సరైన పరిష్కారం చూపని గూడూరు రెవెన్యూ డివిజన్‌ అధికారి, అల్లూరు అర్బన్‌ స్వర్ణ వార్డు అధికారితో పాటు ఇతర బాధ్యులైన అధికారులకు డీఆర్వో విజయకుమార్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.