వజ్రపుకొత్తూరులో మహిళపై కొడవలితో దాడి చేసిన వైనం

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మహాదేవపురంలో ప్రహరీ గోడ వివాదం కారణంగా కల్లి పుష్పల అనే మహిళపై అదే గ్రామానికి చెందిన దమయంతి, సుందరరావు కొడవలితో దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. గాయపడిన పుష్పల పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, బాధితురాలి ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.