హాలీవుడ్ రీమేక్‌లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టిన విజయ్ సేతుపతి
రిపోర్టర్: రాము
స్థలం: చెన్నై
టాలీవుడ్, కోలీవుడ్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన కెరీర్ మరియు రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తనకు మహారాజా 2 కథ వినిపించారని, ఈ చిత్రానికి హాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హాలీవుడ్ స్టార్ నటుడు మాథ్యూ మెక్‌కానగీ నటించనున్న ఆ రీమేక్ చిత్రంలో తనకు చిన్న పాత్ర ఇప్పించాలని నిర్మాతను కోరినట్లు విజయ్ సేతుపతి సరదాగా తెలిపారు.