రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: గుంటూరు

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితిపై ఐఎండీ అమరావతి (IMD Amaravati - ఆంధ్రప్రదేశ్ వాతావరణం & తుఫాను హెచ్చరికలు) వివరాలు వెల్లడించింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు ముప్పై నుండి నలభై, గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.