'కొడుకు శవంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం': అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన మహమ్మద్ జాబేర్ హుస్సేన్ (27) అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉద్యోగం చేస్తూ ఇటీవల వివాహం చేసుకున్నాడు. సెప్టెంబర్ 14న తల్లితో సంతోషంగా మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఆయన నిద్రలోనే అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు ఎంబీటీ ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ ద్వారా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను సంప్రదించి, జాబేర్ భౌతికకాయాన్ని త్వరగా హైదరాబాద్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు.