తెలంగాణలో ప్రత్యేక టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను రూపొందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల మీదుగా సాగే ఈ సర్క్యూట్ ద్వారా ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. కిన్నెరసాని, భద్రాచలం, రామప్ప వంటి ప్రముఖ ప్రాంతాలను కలుపుతూ రూపుదిద్దుకుంటున్న ఈ ప్రణాళిక ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.