హిందుజా విద్యుత్ అదనపు చెల్లింపులపై సీపీఎం బాబూరావు అభ్యంతరం
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
హిందుజా థర్మల్ విద్యుత్ కేంద్రానికి అదనపు చెల్లింపులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఈఆర్సీ బహిరంగ విచారణలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి చేయని విద్యుత్ కోసం డిస్కంలు రూ.1,234 కోట్లు చెల్లించాయని, ఇప్పుడు క్యారీయింగ్ కాస్ట్ పేరుతో మళ్లీ అదనపు మొత్తాలు కోరడం తగదని ఆయన అమరావతిలో జరిగిన విచారణలో పేర్కొన్నారు.