ఆపదలో ఉన్న యువకుడికి అండగా నిలిచిన ఆస్పత్రి సిబ్బంది
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండి సమీప చెరువులో గుర్రపుడెక్కల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరిన గుర్తుతెలియని యువకుడిని కాశీబుగ్గ పోలీసులు రక్షించి పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. గత రెండు రోజులుగా ఆహారం తీసుకోక నీరసించిన ఆ యువకుడి ఆకలిని గమనించిన నర్సులు సొంత నిధులతో భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా নিজ చేతులతో అన్నం తినిపించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ గొప్ప మనసును స్థానికులు, రోగుల బంధువులు అభినందించారు.