'గాడి ఆపు..': లక్నోలో కారు బోనెట్పై యువతి వీరంగం

రిపోర్టర్: నరేష్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గోమ్తీ నగర్ సమీపంలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద ప్రియుడి మోసాన్ని గ్రహించిన యువతి సంచలన ఘటనకు పాల్పడింది. మరో మహిళతో కారులో ఉన్న ప్రియుడిని నిలదీయగా, అతను కారుతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆగ్రహించిన యువతి చెప్పులు లేకుండా కారు బోనెట్పైకి ఎక్కి వెనుకకు నడుస్తూ అద్దాలపై కొడుతూ వీరంగం సృష్టించింది. వేగంగా వెళ్లడంతో కిందపడిన ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.