శ్రీశైలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, తరలివచ్చిన భక్తులు

రిపోర్టర్: నరేష్ స్థలం: నంద్యాల

శ్రావణ మాస నాలుగో శుక్రవారం శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. నంద్యాల, పల్నాడు, మార్కాపురం జిల్లాల నుంచి 1,233 మంది చెంచు గిరిజన మహిళలతో పాటు మొత్తం 1,733 మంది భక్తులు పాల్గొన్నారు. చంద్రావతి కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలకు ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. గిరిజన మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.