భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం: నీట మునిగిన పంటలు
రిపోర్టర్: గోపి
స్థలం: చండ్రుగొండ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుర్ల వాగు, లంకల వాగు ఉప్పొంగడంతో కోతకొచ్చిన వరి, మిరప, పత్తి చేలు దెబ్బతిన్నాయని వారు వాపోయారు. ఈ అకాల వర్షం తమను తీవ్రంగా నష్టపరిచిందని, అధికారులు వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.