జీకే వీధిలో అభ్యర్థి కిల్లో రాజన్ ఎన్నికల ప్రచారానికి పోటెత్తిన గిరిజనులు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో బీసీవై జడ్పీటీసీ అభ్యర్థి కిల్లో రాజన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కొత్త నాయకత్వంతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు శ్రేణులు పేర్కొన్నాయి. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ప్రచారానికి స్థానిక ఆదివాసీల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందని నాయకులు తెలిపారు.