లండన్ లో రామాయణం ప్రమోషన్లు: మోడర్న్ లుక్ లో రణబీర్, యశ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: లండన్

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం లండన్ నగరంలో సందడి చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ప్రత్యేక ఈవెంట్ లో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవి, రావణాసురుడిగా నటిస్తున్న యశ్ తో పాటు దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొని మోడర్న్ క్యాజువల్ డిజైనర్ దుస్తుల్ లో కనిపించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.