తీవ్ర వాయు కాలుష్యం: దిల్లీలో స్టేజి-III ఆంక్షలు అమల్లోకి తెచ్చిన యంత్రాంగం
రిపోర్టర్: సునీల్
స్థలం: దిల్లీ
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కఠిన చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా దిల్లీ-ఎన్సీఆర్ వ్యాప్తంగా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజి-III’ ఆంక్షలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సగటు ఏక్యూఐ 382 మార్కును తాకడంతో పండుగ వేళ ముందస్తుగా భవన నిర్మాణాలు, తవ్వకాలపై పూర్తి నిషేధం విధించి ప్రజలను అప్రమత్తం చేశారు.